భవానికి ఫ్రాన్స్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2021-10-19T07:41:11+05:30 IST

భారత స్టార్‌ ఫెన్సర్‌ భవానీ దేవి మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది.

భవానికి ఫ్రాన్స్‌ టైటిల్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ ఫెన్సర్‌ భవానీ దేవి మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఫ్రాన్స్‌లో జరిగిన చార్లెవిల్లె ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత సబ్రే ఈవెంట్‌లో విజేతగా నిలిచి అదర గొట్టింది. ఈ మేరకు టోర్నీలో సాధించిన ట్రోఫీతో ఉన్న తన ఫొటోను భవాని ట్వీట్‌ చేసింది. 28 ఏళ్ల భవాని.. ఈ ఏడాది టోక్యో క్రీడలతో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారత ఫెన్సర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-10-19T07:41:11+05:30 IST