Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫైనల్లో బోపన్న జోడీ

అడిలైడ్‌: వచ్చేవారంలో మొదలవనున్న ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు అద్భుత సన్నాహకం. సహచర ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌తో కలిసి అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌లో డబుల్స్‌ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. సెమీ్‌సలో అన్‌సీడెడ్‌ బోపన్న-రామ్‌కుమార్‌ జోడీ 6-2, 6-4తో నాలుగోసీడ్‌ టొమిస్లావ్‌ బ్రిక్‌ (బోస్నియా)-శాంటియాగో గోంజాలెజ్‌ (మెక్సికో) జంటపై గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్‌ కోసం టాప్‌సీడ్‌ ద్వయం ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్‌)తో బోపన్న జంట అమీతుమీ తేల్చుకోనుంది. 

Advertisement
Advertisement