India-New Zealand: రెండో టెస్టులో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా...

ABN , First Publish Date - 2021-12-05T17:27:38+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు లంచ్ సమయానికి టీమిండియా భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‎లో పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 69/0తో ప్రారంభించిన భారత్ జట్టుకు మంచి ఆరంభం

India-New Zealand: రెండో టెస్టులో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా...

ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు లంచ్ సమయానికి టీమిండియా భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‎లో పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 69/0తో  ప్రారంభించిన భారత్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. మయాంక్ అగర్వాల్ (62), పుజారా (47) రన్స్ చేశారు. తొలి వికెట్‎కు ఇద్దరు కలిసి 102 పరుగులను జోడించారు. ఈ క్రమంలో అజాజ్‌ పటేల్‌ వీరి భాగస్వామ్యాన్ని విడిదీశాడు. స్వల్ప స్కోర్ వ్యవధిలోనే ఇద్దరిని ఔట్ చేశాడు. దీంతో భారత్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు నమోదు చేసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శుభమన్ గిల్, కెప్టెన్ కోహ్లీ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే..లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ రెండు వికెట్లను నష్టపోయి 142 పరుగులు చేసింది. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‎లో 405 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. క్రీజులో కోహ్లీ 11, శుభమన్ గిల్ 17 రన్స్ చేసి కొనసాగుతున్నారు.

Updated Date - 2021-12-05T17:27:38+05:30 IST