రూ.లక్ష కోట్లు

ABN , First Publish Date - 2020-11-20T06:53:38+05:30 IST

కరోనా కాలంలోనూ భారతీయులు రూ.లక్ష కోట్లకు పైగా చిన్న మొత్తాల్లో పొదుపు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం(ఏప్రిల్‌-సెప్టెంబరు)లో స్మాల్‌ సేవింగ్స్‌ పథకాల్లో పెట్టుబడులు...

రూ.లక్ష కోట్లు

  • ఏప్రిల్‌-సెప్టెంబరులో చిన్న మొత్తాల పొదుపు 


న్యూఢిల్లీ: కరోనా కాలంలోనూ భారతీయులు రూ.లక్ష కోట్లకు పైగా చిన్న మొత్తాల్లో పొదుపు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం(ఏప్రిల్‌-సెప్టెంబరు)లో స్మాల్‌ సేవింగ్స్‌ పథకాల్లో పెట్టుబడులు రూ.97,129 కోట్లకు పెరిగాయి. చరిత్రలో ఆరు నెలల కాలంలో ఈ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడుల్లో ఇప్పటివరకిదే అత్యధిక స్థాయి. గత ఆర్థిక సంవత్సరం(2019-20) ప్రథమార్ధంతో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల ప్రథమార్ధాల్లో వచ్చిన సరాసరి పెట్టుబడుల కంటే 130 శాతం అధికం. ఇక వేతన జీవులు అధికంగా మదుపు చేసే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్ల(పీపీఎ్‌ఫ)లోకి మరో రూ.19,437 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి చిన్న మొత్తాల పొదుపు వార్షిక ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.1.17 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే కాలానికి బ్యాంక్‌ ఖాతాల్లో మరో రూ.లక్ష కోట్లకు పైగా జమయ్యాయి. భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రజలు జాగ్రత్తపడతారనడానికి ఇదే సంకేతమని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డీకే జోషీ అన్నారు. సంక్షోభ కాలంలో ఇది సాధారణ పరిణామమే అని ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2020-11-20T06:53:38+05:30 IST