Abn logo
Jan 12 2021 @ 19:19PM

లగ్జరీ కార్లలోనూ భారతీయులు అదే వెతుకుతారట!

న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కార్లు కొనేటప్పుడు సాధారణంగా దానిలో రకరకాల ఫీచర్ల కోసం చూస్తారు. కానీ భారతీయులు ఎక్కువ ప్రాధాన్యం దేనికి ఇస్తారో తెలుసా? వేల్యూ ఫర్ మనీ. అంటే ఇంత ఖరీదు పెట్టి ఈ కారు కొనచ్చా? అని ఆలోచిస్తారట. ఈ విషయం చెప్పింది మామూలు వ్యక్తి కాదు. ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ మెర్సిడెజ్ బెంజి సీఈవో మార్టిన్ ష్వెంక్. మామూలుగా సాధారణ వస్తువుల్లో ఇలా వేల్యూ ఫర్ మనీ కోసం చూస్తారు. కానీ భారతీయులు మాత్రం ఖరీదైన లగ్జరీ కార్ల విషయంలో ఇదే స్టాండర్డ్ పాటిస్తారని ఆయన అన్నారు. అలాగే మిగతే దేశాల్లోని మార్కెట్లతో పోల్చుకుంటే భారత్‌లో మార్కెట్ డిఫరెంట్‌గా ఉంటుందని మార్టిన్ పేర్కొన్నారు. భారత్‌లో చాలా మంది వినియోగదారులు తమ కార్లకు డ్రైవర్లను పెట్టుకోవడమే దీనికి ముఖ్యమైన కారణమని ఆయన చెప్పారు. అందుకే డ్రైవర్లకు, ఓనర్లకు ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండేలా కార్లను సిద్ధం చేయాల్సి రావడమే భారత మార్కెట్లో ఛాలెంజ్ అని, ఇదే ఈ మార్కెట్‌ను కొంచెం డిఫరెంట్‌గా మారుస్తుందని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement