ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు

ABN , First Publish Date - 2020-06-06T13:32:11+05:30 IST

భారత్‌ విదేశీ మారక నిల్వలు భారీ స్థాయిలో పెరిగాయి. మే 29తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు ఏకంగా 343 కోట్ల డాలర్లు పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో 49,348 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు

భారత్‌ విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీ స్థాయిలో పెరిగాయి. గత కొద్ది వారాలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్లే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయి.

ముంబై, జూన్‌ 5: భారత్‌ విదేశీ మారక నిల్వలు భారీ స్థాయిలో పెరిగాయి. మే 29తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు ఏకంగా 343 కోట్ల డాలర్లు పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో 49,348 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. కరెన్సీ ఆస్తుల పెరుగుదల వల్ల మొత్తం నిల్వలు పెరిగాయని ఆర్‌బీఐ వెల్లడించింది. క్రితం వారంలో విదేశీ మారక నిల్వలు 300 కోట్ల డాలర్లు ఎగబాకాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న కాలంలో విదేశీ మారక నిల్వలు పెరగడం ఊరటనిస్తోంది. సమీక్షా వారం (మే 29)లో విదేశీ కరెన్సీ ఆస్తులు 45,521 కోట్ల డాలర్లకు చేరాయి. ఇక బంగారం నిల్వల విలువ తగ్గుతూనే ఉంది. ఈ నిల్వల విలువ క్రితం వారంతో పోల్చితే 9.7 కోట్ల డాలర్లు తగ్గి 3,268.2 కోట్ల డాలర్లకు చేరాయి.


అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద భారత్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 143 కోట్ల డాలర్ల వద్ద యథాతథంగా ఉన్నాయి. అయితే ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ నిల్వలు మాత్రం 3.1 కోట్ల డాలర్లు పెరిగి 416 కోట్ల డాలర్లకు చేరినట్టు ఆర్‌బీఐ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరగడం,  దిగుమతి వ్యయాలు తగ్గడం దేశ విదేశీ మారక నిల్వలు పెరగటానికి దోహదపడుతున్నాయి.

Updated Date - 2020-06-06T13:32:11+05:30 IST