చెక్ ఇన్’కు... ఇండిగో ఛార్జి... రూ. 100.

ABN , First Publish Date - 2020-10-21T01:02:25+05:30 IST

చెక్ ఇన్ సర్వీసులు రూ. 100 ఛార్జీని ప్రకటించింది విమానయాన సంస్థ ‘ఇండిగో’. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్-ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం(2020 అక్టోబర్ 17) నుంచి ఇండిగో... విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ కోసం రూ. 100 సేవా రుసుమును ప్రవేశపెట్టింది.

చెక్ ఇన్’కు... ఇండిగో ఛార్జి... రూ. 100.

ముంబై : చెక్ ఇన్ సర్వీసులు రూ. 100 ఛార్జీని ప్రకటించింది విమానయాన సంస్థ ‘ఇండిగో’. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్-ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం(2020 అక్టోబర్ 17) నుంచి ఇండిగో... విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ కోసం రూ. 100 సేవా రుసుమును ప్రవేశపెట్టింది.


ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి, ప్రభుత్వాదేశాల నేపధ్యంలో వెబ్ చెక్-ఇన్ చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులను ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ ఫీజు అక్టోబర్ 17 నుండి చేసే అన్ని బుకింగ్‌లకు వర్తిస్తుందని పేర్కొంది. తక్కువ-ధర క్యారియర్ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల కోసం కాంటాక్ట్‌లెస్, ఇబ్బంది లేని ప్రయాణానుభవం కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఇక... ‘ఆన్‌లైన్‌’లో చెక్-ఇన్ చేయడం ద్వారా విమానాశ్రయాల్లో దీర్ఘ క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి వెబ్ చెక్-ఇన్ ఫీచర్ వినియోగదారులకు సహాయపడుతుంది. షెడ్యూల్ చేసిన ప్రయాణాలకు ఒక గంట ముందు ఎప్పుడైనా వెబ్ చెక్-ఇన్ చేయవచ్చు. 

Updated Date - 2020-10-21T01:02:25+05:30 IST