ఐటీలో ‘ఇన్ఫోసిస్’ దూకుడు...

ABN , First Publish Date - 2021-06-24T23:41:11+05:30 IST

స్టాక్ మార్కెట్‌లో రేంజ్ బౌండ్ ట్రేడ్ సాగుతున్నప్పటికీ.. మార్కెట్లు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి.

ఐటీలో ‘ఇన్ఫోసిస్’ దూకుడు...

ముంబై : స్టాక్ మార్కెట్‌లో రేంజ్ బౌండ్ ట్రేడ్ సాగుతున్నప్పటికీ.. మార్కెట్లు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి.  ఈ దశలో కొన్ని స్టాక్స్ సరికొత్త 52 వారాల గరిష్టాలను తాకుతూ దూసుకుపోతున్నాయి. వాటిలో గ్రీవ్స్ కాటన్ 7 శాతం, వీ మార్ట్ రిటైల్  2.89 శాతం పెరగగా, ఐఆర్‌బీ ఇన్ఫ్రా, ఇన్ఫోసిస్, బీఈఎల్ షేర్లు రెండు శాతం వరకూ పెరిగాయి. ఇన్ఫోసిస్ షేరు ఇంట్రాడేలో 3 శాతం వరకూ పెరిగి రూ. 1,543 ధరని తాకి 52 వారాల గరిష్టాన్ని సృష్టించింది. అంతలోనే... మళ్లీ మధ్యాహ్నం 12.43 గంటల సమయానికి  మరోసారి సవరించుకుని రూ. 1551 కు ఎగసింది. 


షేర్ల బై బ్యాక్ ఓపెన్ మార్కెట్ రేపటినుంచి ప్రారంభం కానుండటమే ఈ జోరుకు కారణంగా తెలుస్తోంది. బీవఈఎల్ షేర్లు ఇంట్రాడేలో రూ. 173.80 ధరను తాకడంతో 52 వారాల గరిష్టీన్ని చేరుకుంది.  రిటైల్ రంగ దిగ్గజం వీ మార్ట్ రిటైల్ ఇంట్రాడేలో రూ. 3,141.90 కి ఎగసి సరికొత్త గరిష్టాన్ని తాకడమే కాకుండా ట్రేడర్లకు ఒక్క రోజులోనే దాదాపు రూ. 250 లాభాన్ని అందించింది. 


ఐఆర్‌బీ ఇన్ఫ్రా షేరు ఇంట్రాడేలో 4 శాతం పెరిగి రూ. 170 ధరను చేరింది. ఈ స్టాక్‌కు ఇది  కొత్త గరిష్టం. మహీంద్రా సీఐఈ కూడా సరికొత్త గరిష్టాన్ని( రూ. 240) తాకగా, హైదరాబాదీ కంపెనీ తాన్లా సొల్యూషన్స్ కూడా బోర్డ్ ఎక్కేసింది. తాన్లా సొల్యూషన్స్ 3 శాతం పెరిగి రూ. 855 కిఎగసి కొత్త గరిష్టాన్ని తాకింది.

Updated Date - 2021-06-24T23:41:11+05:30 IST