నూతన ఆవిష్కరణల ‘ఇన్‌స్పైర్‌’

ABN , First Publish Date - 2020-09-21T06:20:06+05:30 IST

విద్యార్ధుల్లో వైజ్ఙానిక ఆంశా లపై ఆసక్తిని పెంచడం, విద్యార్ధుల్లో సృజనాత్మకతను, వినూతన ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర

నూతన ఆవిష్కరణల ‘ఇన్‌స్పైర్‌’

ఎంపికైన ప్రతీ విద్యార్థికీ రూ.పది వేలు

జిల్లాలో గత ఏడాది 925 ఎగ్జిబిట్‌లు 

ఈ ఏడాది 98 మాత్రమే దరఖాస్తు

నెలాఖరు వరకు గడువు


ఇల్లెందు, సెప్టెంబరు 20: విద్యార్ధుల్లో వైజ్ఙానిక ఆంశా లపై ఆసక్తిని పెంచడం, విద్యార్ధుల్లో సృజనాత్మకతను, వినూతన ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డుల కోసం ద రఖాస్తు చేసుకునేందుకు జిల్లాలోని పాఠశాలల ఉ పాధ్యా యులు నిర్లిప్తతత ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు పెల్లుబు కుతున్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 15 ఏండ్లలోపు విద్యార్ధుల్లో శాస్త్రసాంకేతిక రంగా లతోపాటు సృజనాత్మకతను పెంపొందించేందుకు గుజ రాత్‌లోని నేషనల్‌ ఇన్నోవేషన్‌ పౌండేషన్‌ సంస్ధ, కేంద్ర సాంకేతిక శాఖలు విశేషంగా చేస్తున్న కృషిలో ఇన్‌స్పైర్‌ మ నక్‌ ఆవార్డులు గ్రామీణ విద్యార్ధులకు,  ప్రతిభావం తులైన విద్యార్ధులను ప్రొత్సహించేందుకు దోహదపడుతుంది.  కేం ద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇన్‌స్పైర్‌ అవార్డుల పథ కానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లానుంచి వివిధ యాజ మాన్యల పాఠశాలలు దరఖాస్తు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం అవలంభిస్తున్నాయన్న విమర్శలు పెల్లుబుకుతున్నాయి.


గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 925 పరిశో ధనలు ఇన్‌స్పైర్‌ అవార్డులకు దరఖాస్తు చేయగా ఈ ఏడా ది ఇప్పటివరకు 98 పరిశోధనలు మాత్రమే రిజిస్టర్‌ కావడం గమనార్హం. గత ఏడాది జిల్లా నుంచి దరఖాస్తు చేసిన పాఠశాలల నుండి 86 పరిశోధన అంశాలు ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డుకు ఎంపిక కావడం వారందరికి నూతన అవిష్కరణల కోసం రూ 10వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా  2020- 21 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్‌ అవార్డులకు విద్యార్ధులు నామినేషన్లను పంపా లని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రదానోపా ధ్యాయులకు, సైన్స్‌ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి జూన్‌ మాసంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ మే రకు జాతీయ ఇన్నోవేషన్‌పౌండేషన్‌, జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ, ప్రాజెక్టుల ఎంపికలో మెళుకువలు, తయారీలో నైపుణ్యాలు పెంచే విధంగా నాణ్యమైన ప్రాజెక్టులను రూపొందించేందుకు జిల్లాలోని ఎంఈవోలకు, ప్రదానోపాధ్యాయులకు సైన్స్‌ ఉపాధ్యా యులకు అవగాహన కార్యక్రమాలను అన్‌లైన్‌ ద్వారా వెబ్‌నార్‌ల ద్వారా నిర్వహించారు.


అయినప్పటీకీ నేటి వ రకు జిల్లా వ్యాపితంగా అర్హత కలిగిన 462 పాఠశాలల్లో  98 పాఠశాలలు మాత్రమే  ఇన్‌ స్పైర్‌ నామినేషన్లను దా ఖలు చేయడం గమనార్హం. ఈ పథకానికి ఎంపికైన  విద్యార్థికీ ప్రాజెక్టు రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ 10వేలు నగదు చెల్లించడమే గాక జాతీయస్ధాయిలో విద్యార్ధుల ప్రతిభ నైపుణ్యాలను  గుర్తించేందుకు మంచి అవకాశం ఉన్నప్పటీకీ ఉపాధ్యాయులు  పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాఠశాలలో 6నుంచి 10వతరగతి విద్యార్ధులకు ఇన్‌స్పైర్‌ అవార్డులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ పరిణా మాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తూ జిల్లాలోని ఎంఈఓలు, ప్రదానోపాద్యాయులకు  ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పాఠశాల నుంచి 2నుంచి 5ప్రాజెక్టులు ఈనెల 30వ తేది లోపు నమోదు చేయాలని, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఎక్స్‌ఆఫిసియో ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. సందేహలు, సమస్యలు ఉత్పన్నమయితే జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌ చల పతిరాజు సెల్‌ నెంబర్‌ 9247296012ను సంప్రదించాలని ఆయన కోరారు.

 

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా..

ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులకు రిజిస్ట్రేషన్‌ తొలుత వేబ్‌సైట్‌లోకి వెళ్లి స్కూల్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి. అనంతరం వెబ్‌సైట్‌లో పాఠశాల యూడైస్‌, ఈ- మేయిల్‌ఐడి, విద్యార్ధుల సంఖ్య, ప్రదానాపాధ్యాయుడి పేరు సెల్‌ నెంబర్‌, పాఠశాల ఇన్‌స్పైర్‌ ఇన్‌చార్జీ ఉపాధ్యాయుడు పేరు, సెల్‌ నెంబర్‌, పాఠశాల చిరునామ తదితర వివరాలను నమోదు చేయాలి. 5నిమిషాల పిదప యూజర్‌ ఐడీ, పాస్‌వర్డు జనరేట్‌ అవుతుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు నేరుగా యూజర్‌ ఐడీ, ఫాస్‌వర్డుతో లాగీన్‌ కావోచ్చు. అనంతరం ప్రాధమికోన్నత పాఠశాలలనుంచి ఇరువురు, ఉన్నత పాఠశాలలనుండి ఐదుగురు   విద్యార్ధుల పేర్లు, వారి తండ్రీ పేర్లు, పుట్టిన తేదీ, ఆదార్‌నెంబర్‌, బ్యాంకు ఖాత నెంబర్లు, విద్యార్ధులు చేసే ప్రాజెక్టుల సమచారాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 2020-21 విద్యాసంవత్సరంలో అవార్డులకు దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్‌30 తుది గడువుగా కేంద్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. 

Updated Date - 2020-09-21T06:20:06+05:30 IST