రాహుల్‌కు ఇంటర్నేషనల్‌ సైంటిస్ట్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-06-18T05:39:37+05:30 IST

రాహుల్‌కు ఇంటర్నేషనల్‌ సైంటిస్ట్‌ అవార్డు

రాహుల్‌కు ఇంటర్నేషనల్‌ సైంటిస్ట్‌ అవార్డు

ఇమేజ్‌ సెగ్మెంటేషన్‌లో నూతన ఆవిష్కరణలు 


కరీమాబాద్‌, జూన్‌ 17 : వరంగల్‌ కరీమాబాద్‌ ప్రాం తానికి చెందిన కుసుమ రాహుల్‌ ఇంటర్నేషనల్‌ సైంటిస్ట్‌ అవార్డు-2021కు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని లాట్రోబ్‌ యూనివర్సిటీలో ఎలక్ర్టానిక్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన రాహుల్‌ అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇమేజ్‌ సెగ్మెంటేషన్‌లో నూతన ఆవిష్కరణలు చేసినందుకు వీడీ-గుడ్‌ ఇంటర్నేషనల్‌ మైసూర్‌ వారు రాహుల్‌కు ఇంటర్నేషనల్‌ సైంటిస్ట్‌ అవార్డు -2021ను ప్రకటించారు. వైద్యరంగంలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌, అంతరిక్ష శాటిలైట్‌ ఇమేజింగ్‌, సెల్‌ఫోన్లలో కెమెరా క్లారిటీ విషయంలో ఈ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కరీమాబాద్‌కు చెందిన కుసుమ నర్సింహస్వామి - నివేదిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె మానస దంత వైద్యురాలిగా అమెరికాలో స్థిరపడ్డారు. రాహుల్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుండగా, మూడో కుమార్తె సాహితి సీఎ్‌సఈలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు. కాగా, రాహుల్‌ బాల్యం నుంచి చదువులో ప్రతిభ కనబరిచేవారు. 2010లో స్పేస్‌ ఎంట్రన్స్‌ నుంచి నాసాకి ఎంపికయ్యారు. 2011 లో జేఎ్‌సఎం స్కూల్‌ నుంచి సైన్స్‌ ఫెయిర్‌లో జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. 2012లో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇన్‌స్పైర్‌ సైంటిస్ట్‌ సర్టిఫికెట్‌ పొందాడు. 

కాగా, ఇంటర్నేషనల్‌ సైంటి స్ట్‌ అవార్డుకు రాహుల్‌ ఎంపిక కావడంపై అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు గురువారం రాహుల్‌ తల్లిని వారి ఇంటిలో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. బీజేపీ తూర్పు ఇన్‌చార్జి కుసుమ సతీష్‌ కార్పొరేటర్లు చాడ స్వాతిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, చింతాకుల అనిల్‌, ఎరుకల రఘునారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జలగం రంజిత్‌ తదితరులు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-06-18T05:39:37+05:30 IST