900 గ్రామాలకు ఇంటర్‌ నెట్‌

ABN , First Publish Date - 2021-09-18T08:45:29+05:30 IST

900 గ్రామాలకు ఇంటర్‌ నెట్‌

900 గ్రామాలకు ఇంటర్‌ నెట్‌

గిరిజనుల బతుకుల్లో వెలుగులు.. సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజనులకు ఆర్వోఎ్‌ఫఆర్‌ పట్టాలిచ్చి, బోర్లు వేసి పంటల సాగుకోసం కార్యాచరణ రూపొందించినట్టు సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని 900 గ్రామాలకు 400 టవర్ల ద్వారా ఇంటర్నెట్‌, టెలికం సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ ఈ నెల 26న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాడేపల్లిలోని నివాసంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై పోలీసు, గిరిజన సంక్షేమశాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆసరా, అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన తదితర పథకాలతో గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వలంటీర్‌ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం సత్ఫలితాన్ని ఇచ్చిందని తెలిపారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య 50 మందికి తగ్గిపోయిందని, సంక్షేమ పథకాలు గిరిజనుల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపాయని చెప్పారు.   


Updated Date - 2021-09-18T08:45:29+05:30 IST