న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-06-23T03:49:17+05:30 IST

న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): జిల్లాలో లా కోర్సు చేసిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాది వృత్తిలో మూడే ళ్ల పాటు ఉచిత శిక్షణ పొందేందుకు 2021-22కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మంగళ వారం తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన కళాశాల నుంచి లాకోర్సు పాసైం ఉండాలన్నారు. జూలై 2021 నాటి కి 23 నుంచి 35ఏళ్లలోపు ఉండాలన్నారు. తండ్రి/సంరక్షకు ని వార్షికాదాయం గ్రామీణులైతే రూ.1.50లక్షలు, పట్టణ వా సులైతే రూ.2లక్షలకు మించరాదన్నారు. అభ్యర్థుల కుటుంబంలో ఎవరూ గతంలో ఉచిత శిక్షణ పొంది ఉండరాదని, డిక్లరేషన్‌ జత చేయాలన్నారు. బార్‌ కౌన్సిల్‌లో  న మోదై ఉండాలన్నారు. అభ్యర్థులు లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌, 3వ అ ంతస్తులో జూలై 15లోపు తమ దరఖాస్తులను అందజేయాలని తెలిపారు.

సాంకేతిక కోర్సుల శిక్షణకు ...

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో శిక్షణకు  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా సంక్షేమాధికారి మోతి మంగళ వారం తెలిపారు. అనాథలు, నిరాశ్రుయులైన ఆడపిల్లలు, మానవ అక్రమ రవాణాకు గురైన బాధితులు, బాలల సందనం, మహిళా సంస్థల్లో ఆశ్రమం పొందిన వారు, పాలిసెట్‌ రాయలని వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు తమ ఆదాయ, కుల ధ్రు వీకరణ పత్రాలను జతచేయాలన్నారు. డిప్లామా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ర్టానిక్స్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ర్టికల్‌ ఇంజినీర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, స్టేట్‌ హోం, వెంగళ్‌రావునగర్‌, అమీర్‌పేట, రూమ్‌నెంబర్‌ 14లో సాయంత్రం 5గంటలకల్లా అందజేయాలని మోతి వివరించారు.

Updated Date - 2021-06-23T03:49:17+05:30 IST