‘లండన్‌లో ఐపీఎల్‌’!

ABN , First Publish Date - 2021-04-10T09:13:50+05:30 IST

ఐపీఎల్‌ను లండన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని ఆ నగర మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ తెలిపారు.

‘లండన్‌లో ఐపీఎల్‌’!

లండన్‌: ఐపీఎల్‌ను లండన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని ఆ నగర మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌ఎ్‌ఫఎల్‌), మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌ (ఎంఎల్‌బీ)లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. విరాట్‌, రోహిత్‌, పంత్‌ల ఆటతీరును వీక్షించేందుకు లండన్‌ వాసులు ఆతృతగా ఉన్నారని ఖాన్‌ చెప్పారు. అన్ని దేశాల ప్రజలు లండన్‌లో ఉండడంతో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆదరణ ఎక్కువగా ఉంటుందని, అలాగే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Updated Date - 2021-04-10T09:13:50+05:30 IST