ఐపీఎల్-2020.. ఆ జట్ల ఓటమికి కారణమేంటి..?

ABN , First Publish Date - 2020-11-10T04:00:11+05:30 IST

ఇండియన్ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. సీనియర్ల స్టార్‌డమ్.. నయా ఆటగాళ్ల టాలెంట్.. వెరసి క్రికెట్‌కే కొత్త మెరుపు తీసుకొస్తుంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు కూడా ఐపీఎల్ కోసం ఎదురు చూస్తుంటారు.....

ఐపీఎల్-2020.. ఆ జట్ల ఓటమికి కారణమేంటి..?

కరోనా సమయంలో అసలు ఐపీఎల్ సాధ్యపడుతుందా..? అనుకున్నాం. కానీ 5 నెలల గ్యాప్‌ తీసుకుని టోర్నీ మొదలైంది. ప్రేక్షకులు లేని మ్యాచ్‌లు మునుపటి స్థాయిలో అలరిస్తాయా..? అని అనుమానించాం. కానీ అంతకు రెట్టింపు మజాతో ఐపీఎల్-2020 సాగుతోంది. అంతేకాదు ఎప్పటిలానే ఈ ఏడాది కూడా టోర్నీలో ఎన్నో ట్విస్టులున్నాయి. అద్బుత జట్లన్నీ పత్తా లేకుండా పోయాయి. ఏ మాత్రం అంచనాల్లేని జట్టు ఫైనల్ బెర్త్‌కు అర్హత సాధించింది. 


ఇండియన్ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. సీనియర్ల స్టార్‌డమ్.. నయా ఆటగాళ్ల టాలెంట్.. వెరసి క్రికెట్‌కే కొత్త మెరుపు తీసుకొస్తుంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు కూడా ఐపీఎల్ కోసం ఎదురు చూస్తుంటారు.. ఈ టోర్నీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అందులోనూ చెన్నై, బెంగళూరు, రాజస్థాన్, ముంబై వంటి జట్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ ఏడాది ఒక్క ముంబై తప్ప మిగతా జట్లన్నీ కుదైలైపోయాయి. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ప్లేఆఫ్‌కు కూడా చేరకుండా ఇంటి దారి పట్టింది.


ఈ ఏడాది ఐపీఎల్ అభిమానులకు ఎంత మజా పంచినా.. టోర్నీలోని కొన్ని ట్విస్టులు సగటు క్రికెట్ అభిమానికి మింగుడు పడడం లేదు. అందులో మొట్టమొదటిది చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవం. చెన్నైతో పాటు మిగతా జట్లు కూడా కొన్ని మ్యాచ్‌లలో గెలుపు అంచులనుంచి ఓటమి ఊబిలోకి కూరుకుపోయాయి. అసలు చెన్నై ఘోరంగా విఫలమవడానికి కారణం ఏంటి..? కీలక మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాళ్లు చేతులెత్తేశారెందుకని..? ప్లేఆఫ్ ముందు వరకు అద్భుతంగా ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లేఆఫ్ చేరలేకపోవడం వెనక రహస్యమేంటి..? మొదటి మ్యాచుల్లో అద్భుత ఫాం కనబరచిన రాజస్థాన్ ఆ తరువాత ఎందుకు చతికిలబడింది..? వంటి ఎన్నో ప్రశ్నలే అభిమానుల మనసులో మెదులుతున్నాయి.. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.


చెన్నై.. ఘోర పరాభవం

ఐపీఎల్‌లోనే చెన్నై లాంటి స్టార్ జట్టు లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని జట్లకంటే అత్యధికంగా 10 సార్లు ప్లేఆఫ్‌కు చేరింది. 8 సార్లు ఫైనల్‌లో తలపడింది. మూడు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుని ధోనీసేనంటే ఆషామాషీ కాదని నిరూపించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని టోర్నీల్లోనూ స్టార్ జట్టుగానే దూసుకెళ్లింది. అత్యధిక విన్నింగ్ పర్సెంటేజ్ 61.28 శాతంతో అదరగొడుతూ వచ్చింది. కానీ ఈ ఏడాది అనూహ్యంగా ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లలో కేవలం 6 విజయాలతో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చెన్నై పరాభవానికి కారణాలను తరచిచూస్తే.. ముఖ్యంగా రైనా లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.


‘మధ్య’లో దెబ్బతిన్న రాజస్థాన్ రాయల్స్

మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీ గెలిచి టోర్నీ చరిత్రలోనే తొలి విజయాన్ని నమోదు చేసింది రాజస్థాన్. కానీ ఆ తరువాత ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. కొన్నిసార్లు ప్లే ఆఫ్స్ వరకు వచ్చినా వారి అదృష్టం అక్కడికే పరిమితమైంది. ముఖ్యంగా గతేడాది, ఈ ఏడాది టోర్నీల్లో రాజస్థాన్ ప్రదర్శన దారుణంగా ఉంది. 2019లో 7వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ ఈ ఏడాది ఏకంగా చిట్టచివరి స్థానానికి పడిపోయింది. అయితే రాజస్థాన్ ఓటమికి మిడిలార్డర్ రాణించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తన క్రికెట్ కెరీర్లోనే తొలిసారిగా ఓపెనర్ అవతారమెత్తి మంచి ఆరంభాలిచ్చాడు. అతడికి తోడు సంజూ శాంసన్ కూడా అద్భుత ఫాం కనబరిచాడు. కానీ మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది.


పడి లేచిన పంజాబ్.. కానీ..

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని చేజిక్కించుకోని దురదృష్ట జట్లలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా ఒకటి. స్టార్ జట్లలో ఒకటైనప్పటికీ.. ఏనాడూ స్థాయికి తగ్గ ప్రదర్శన పంజాబ్‌లో కనపడలేదు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి యాజమాన్యం తప్పుడు నిర్ణయాలే పంజాబ్ జట్టును దెబ్బ తీస్తూ వస్తున్నాయి. సెహ్వాగ్, యువరాజ్ వంటి అద్భుత ప్లేయర్ల కెప్టెన్సీలోనూ ఈ జట్టు ట్రోఫీ నెగ్గలేకపోయింది. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ సగం పూర్తయ్యే వరకు గేల్‌కు జట్టులో చోటివ్వకపోవడం పంజాబ్‌ను భారీగా దెబ్బతీసింది. యాజమాన్యం, మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి మ్యాచ్‌లలో గేల్ వచ్చినా అప్పటికే పంజాబ్ పీకల్లోని కష్టాల్లో మునిగిపోయింది. 


కెప్టెన్సీ కష్టాలతో కోల్‌కతా..

కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు.. కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి తయారైంది. కెప్టెన్సీ బాధ్యతలు మోర్గాన్‌కు కాకుండా దినేశ్ కార్తీక్ అప్పగించడంతోనే కేకేఆర్ పతనం మొదలైంది. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం జట్టు పూర్తి ప్రదర్శననే దెబ్బతీసింది. టోర్నీ సగం పూర్తయ్యే వరకు కార్తీక్‌నే కొనసాగించడంతో కేకేఆర్ పీకల్లతో కష్టాల్లో మునిగిపోయింది. భారీ ఓటములనే మూటగట్టుకుంది. 


బెంగళూరు.. పాత కథే..

13 ఏళ్లుగా వరుస దండయాత్రలు చేస్తున్నా ఫలితం లేదు. కప్పు కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నా ఆశ తీరిందీ లేదు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి ఇది. ప్రారంభ సీజన్లలో సీనియర్ కెప్టెన్లు కొనసాగినా.. గత 8 సీజన్ల నుంచీ విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. భారత జట్టుకు ఎన్నో విజయాలను, సిరీస్‌లను అందిస్తున్న విరాట్.. బెంగళూరుకు మాత్రం ఇప్పటివరకు ఒక్క ట్రోఫీని కూడా అందించలేకపోయాడు. అయితే మునుపటి టోర్నీల్లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన బెంగళూరు.. బౌలింగ్‌ కారణంగా ఓడిపోతూ వచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా బౌలింగ్ బలపడినా.. బ్యాటింగ్‌లో తడబడింది. కోహ్లీ, డివిలియర్స్‌లపైనే జట్టు అధికంగా ఆధారపడింది.


హైదరాబాద్‌ను దెబ్బతీసిన గాయాలు..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. టోర్నీ ఆరంభంలో అంతగా అంచనాల్లేకపోయినా.. సీజన్ గడిచేకొద్దీ రైజర్స్ బలమేంటో తెలుస్తుంది. అయితే ఈ ఏడాది హైదరాబాద్ జట్టు విజయాలపై గాయాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఫాంలో ఉన్న ఆటగాళ్లందరూ ఒకరి తరువాత మరొకరు గాయాలపాలై డగౌట్‌కు పరిమితమవడంతో హైదరాబాద్‌కు గెలుపు కత్తిమీద సాములా మారింది. కానీ అద్భుతమైన పోరాటం కనబరిచి, పెద్ద పెద్ద జట్లను మట్టికరిపిస్తూ మూడో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరింది. 


ఢిల్లీ చరిత్ర సృష్టించేనా..

ఐపీఎల్ చరిత్రలోనే సుదీర్ఘంగా కప్పు కోసం ఎదురు చూస్తున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. 13 ఏళ్లుగా కప్పు కోసం పోరాడుతున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పును అందుకోలేకపోయింది. ఈ ఏడాది మాత్రం జట్టు యువ రక్తంతో తొణికిసలాడుతోంది. ప్రతి జట్టునూ చిత్తుగా ఓడిస్తూ.. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో కొనసాగుతూ సగర్వంగా ప్లేఆఫ్ చేరింది. అయితే మొదటి క్వాలిఫయర్‌లో ముంబై చేతిలో ఓటమి చవిచూసినా క్వాలిఫయర్-2లో మాత్రం గొప్పగా ఆడి గెలుపు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్ చేరింది. మరి మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరగబోయే ఫైనల్‌లో కూడా విజయం సాధించి చరిత్ర సృష్టిస్తుందేమో వేచి చూడాలి.


ముంబై జోరు కొనసాగుతుందా..?

ఐపీఎల్‌లో అత్యధికంగా 5 సార్లు ట్రోఫీ ముద్దాడిన జట్టు ముంబై ఇండియన్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటిలో ముంబై పటిష్ఠంగా ఉంది. ఎప్పటిలానే టాప్‌లో ప్లేఆఫ్‌కు చేరింది. తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీని చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ప్రస్తుత టోర్నీలో మిగతా జట్లతో పోల్చితే ముంబై అత్యంత పటిష్ఠంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫాంలో ఉన్నారు. ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, హార్థిక్ పాండ్యాలతో మిడిలార్డర్‌ కూడా అంతే బలంగా ఉంది. 




 బౌలింగ్ కూడా మునుపటి స్థాయిలో లేదు. అనుభవజ్ఞులైన సీనియర్ పేసర్ ఒక్కరు కూడా లేకపోవడం చెన్నైను భారీగా దెబ్బ తీసింది. అంతేకాకుండా జట్టంతా ఎక్కువగా వయసు మీదపడిన సీనియర్ ఆటగాళ్లతో నిండిపోవడంతో ఉత్సాహం కొరవడింది. షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్ తప్ప మిగతా ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, యువ ఆటగాళ్లకు ఒకటి, రెండు మ్యాచ్‌లలోనే అవకాశం ఇవ్వడం వంటి అంశాలు జట్టు గెలుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.


వరల్డ్ కప్‌ విన్నింగ్ హీరో, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో పాటు అదే జట్టులో సభ్యుడైన జోస్ బట్లర్ కూడా జట్టులో ఉన్నా విజయాలను నమోదు చేయలేకపోయారు. టోర్నీ మధ్యలో స్టోక్స్ జట్టుతో కలిశాడు. అప్పటి నుంచి కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ సంజు, స్మిత్‌లు ఫాం కోల్పోవడంతో అంతా తారుమారైంది. బాధ్యతంతా స్టోక్స్ పైనే పడింది. దీంతో రాజస్థాన్ జట్టు వరుస ఓటములతో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.


కెప్టెన్ కేఎల్ రాహుల్ అనుభవలేమి కూడా జట్టు ఓటములకు కొంతమేర కారణంగా చెప్పవచ్చు. అత్యంత సునాయాసంగా గెలవగలిగే మ్యాచ్‌లలో సైతం చెత్త ఆటతీరుతో పంజాబ్ ఓటమి పాలైంది. పంజాబ్ ఎక్కువగా గెలవగలిగే మ్యాచ్‌లలోనే ఓటమి పాలవడం గమనార్హం. మిడిలార్డర్‌లో కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమవడం పంజాబ్‌ను క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇక బౌలింగ్‌లో మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌లు కూడా కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేయడం వల్లే పంజాబ్ గ్రూప్ దశ నుంచే నిష్రమించింది.


దీనికితోడు సరైన ఓపెనింగ్ జోడీ లేకపోవడం, మిడిలార్డర్ రాణించకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆండ్రూ రస్సెల్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. అన్నీ కలిసి కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతు చేశాయి. దీంతో తప్పు తెలుసుకున్న జట్టు యాజమాన్యం చివర్లో మోర్గాన్‌ను కెప్టెన్ చేసింది. మోర్గాన్ కెప్టెన్సీలో కేకేఆర్ వరుస విజయాలను నమోదు చేసినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే వెనకబడడంతో ప్లేఆఫ్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. 


ఓపెనర్ పడిక్కల్ రాణించినా జట్టు గెలుపునకు ఉపయోగపడలేదు. ఇక ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. సరైన ఓపెనింగ్ జోడీ లేకపోవడం కూడా బెంగళూరును దెబ్బతీసింది. మిడిలార్డర్ కష్టాలు బెంగళూరునూ వదల్లేదు. అయితే ఎలాగోలా ప్లేఆఫ్‌కు చేరినా.. సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాంటింగ్.. రెండు విభాగాల్లోనూ విఫలమై ఘోర పరాజయంతో ఇంటి దారి పట్టింది. ప్రతి సీజన్‌కూ జట్టులో ఆటగాళ్లను మారుస్తుండడం, ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగడమే బెంగళూరు ఓటములకు కారణంగా సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.


ఎలిమినేటర్-1లో యువ పేసర్లు నటరాజన్, సందీప్ శర్మ, విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ సూపర్ బౌలింగ్‌కు రషీద్ ఖాన్ స్పిన్ మ్యాజిక్ తోడవడంతో బెంగళూరును చిత్తుగా ఓడించింది. అయితే క్వాలిఫయర్-2లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడికి తలొగ్గింది. అయితే ఓటమితో హైదరాబాద్ ఇంటి దారి పట్టినా చక్కటి పోరాట పటిమతో అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది.


బౌలింగ్‌లో బూమ్రా గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది బెస్ట్ బౌలర్స్ లిస్ట్‌లో బూమ్రా టాప్-2‌లో ఉన్నాడు. ఇక గతేడాది ఢిల్లీ తరపున ఆడిన న్యూజిల్యాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఈ ఏడాది ముంబై తరపున బరిలోకి దిగాడు. చక్కటి ఫాంను కొనసాగిస్తున్నాడు. తొలి క్వాలిఫయర్‌లో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. మరి అలాంటి ఆటగాళ్లున్న ముంబై.. ఈ సారి కూడా కప్పు పట్టేస్తుందో లేదో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.


మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. అద్భుత ఆటతీరుతో ప్లేఆఫ్ చేరడమే కాకుండా ఎలిమినేటర్-2లోనూ విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది . ముంబై ఇండియన్స్ ఎప్పటిలానే వరుస విజయాలతో ఫైనల్‌‌ చేరింది. అయితే ఈ ఏడాది ఎలాగైనా కప్పు గెలవాలనుకున్న బెంగళూరుకు సన్‌రైజర్స్ షాకిచ్చింది. ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసి.. ఎలిమినేటర్-2కు అర్హత సాధించింది. కానీ ఢిల్లీతో జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. హోరాహోరీ మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం జరగబోతున్న ఫైనల్‌లో ముంబైతో తలపడనుంది. 

Updated Date - 2020-11-10T04:00:11+05:30 IST