Abn logo
Jan 14 2021 @ 01:04AM

18 నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓ

ముంబై: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఐపీఓ ఈ నెల 18న ప్రారంభమవుతోంది. ఒక్కో షేరును రూ.25-26 ధరల శ్రేణిలో జారీ చేస్తున్నారు. ఈ నెల 20న ముగిసే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.4,600 కోట్లు సమీకరించబోతోంది. ఇందుకోసం కంపెనీ 178.20 కోట్ల షేర్లు జారీ చేస్తోంది. భారత రైల్వేలకు చెందిన ఒక ఎన్‌బీఎ్‌ఫసీ ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి. 

Advertisement
Advertisement
Advertisement