నేటి నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓ

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

ఈ వారం రెండు ప్రధాన కంపెనీలు రూ.5,800 కోట్లకు పైగా సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయి.

నేటి నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓ

న్యూఢిల్లీ: ఈ వారం రెండు ప్రధాన కంపెనీలు రూ.5,800 కోట్లకు పైగా సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయి. ఇందులో ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కంపెనీ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌ సోమవారం ప్రారంభమై    ఈ నెల 20న ముగుస్తుంది. ఇందుకోసం కంపెనీ ఒక్కో షేరును రూ.25-26 చొప్పున 178.20 కోట్ల షేర్లు జారీ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా ఐఆర్‌ఎఫ్‌సీ రూ.4,633.4 కోట్ల వరకు సమీకరించనుంది. కాగా ఈ నెల 20న ప్రారంభమై 22న సబ్‌స్ర్కిప్షన్‌ ముగిసే ఐపీఓ ద్వారా ఇండిగో పెయింట్స్‌ కంపెనీ రూ.1,170.16 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం ఒక్కో షేరును రూ.1,488-1,490 ధరల శ్రేణిలో జారీ చేస్తోంది. 

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST