ఇజ్రాయెల్‌లో కరోనా కల్లోలం.. మహమ్మారి బారిన పడ్డ మంత్రి!

ABN , First Publish Date - 2020-08-03T00:08:03+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఇజ్రాయెల్‌లోనూ మహమ్మారి విజృంభిస్తోంది. ఇజ్రాయెల్ హెరి

ఇజ్రాయెల్‌లో కరోనా కల్లోలం.. మహమ్మారి బారిన పడ్డ మంత్రి!

జెరుసలేం: కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఇజ్రాయెల్‌లోనూ మహమ్మారి విజృంభిస్తోంది. ఇజ్రాయెల్ హెరిటేజ్ మంత్రి రఫీ పెరెట్జ్.. శనివారం రోజు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. మంత్రికి కరోనా సోకడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. రఫీ పెరెట్జ్ కరోనా బారినపడటంతో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా ఇతర శాసన సభ్యులు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందో లేదో నిర్ధారించడానికి అధికారులు కాంటక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌ మాజీ మంత్రి యాకోవ్ లిట్జ్మాన్‌కు కూడా కరోనా బారినపడ్డారు. అయితే ఆయన మహమ్మారి నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే ఇజ్రాయెల్‌లో 1,248కరోనా కేసులు నమోదవ్వగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 72వేలు దాటింది. 526 మంది  కరోనా కాటుకు బలయ్యారు. 


Updated Date - 2020-08-03T00:08:03+05:30 IST