25 దేశాలకు ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని.. భారత్ పేరు మాత్రం..

ABN , First Publish Date - 2021-05-17T05:00:55+05:30 IST

ప్రస్తుతం ప్రంపంచం మొత్తం చర్చనీయాంశంగా మారిన అంశం ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు. ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య జరుగుతున్న పోరాటాల్లో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు.

25 దేశాలకు ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని.. భారత్ పేరు మాత్రం..

జెరూసలేం: ప్రస్తుతం ప్రంపంచం మొత్తం చర్చనీయాంశంగా మారిన అంశం ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు. ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య జరుగుతున్న పోరాటాల్లో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు కూడా ఈ సంక్షోభంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. తాము ఎవరి వైపు నిలబడుతున్నామో కూడా చూచాయగా చెప్పేస్తన్నాయి. ఈ క్రమంలోనే తమకు మద్దతుగా నిలిచిన దేశాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం నాడు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. 25 దేశాల జెండాలను షేర్ చేశారు.


ఆ దేశాలన్నీ ‘టెర్రరిస్టు దాడుల సమయంలో తమ ఆత్మరక్షణ’కు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. అయితే ఈ జాబితాలో భారత్‌ను ఆయన ప్రస్తావించలేదు. భారత జెండాను షేర్ చేయలేదు. కాగా, యూఎన్ భద్రతా మండలి సమావేశంలో ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం గురించి చర్చించారు. ఆ సమయంలో అన్ని హింసాత్మక దాడులను భారత్ ఖండించింది. ముఖ్యంగా గాజా నుంచి చేసిన రాకెట్ దాడులను తప్పుబట్టింది. 

Updated Date - 2021-05-17T05:00:55+05:30 IST