‘కార్డులు’వచ్చేశాయి

ABN , First Publish Date - 2021-06-22T09:13:30+05:30 IST

కొవిడ్‌ కారణంగా గతేడాది నుంచి రాష్ట్ర రవాణ శాఖను వేధిస్తున్న కార్డుల సమస్య ఎట్టకేలకు తీరింది. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు ఇచ్చే సీ-బుక్‌లు, ఎల్‌ఎల్‌ఆర్‌ తర్వాత ఇచ్చే శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు ఇక

‘కార్డులు’వచ్చేశాయి

ఇక సీ-బుక్‌లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ

బెజవాడకు 2.5 లక్షల కార్డులు సరఫరా 

కొవిడ్‌ సంక్షోభంతో గతేడాది నుంచి లోటు 

ప్రతి జిల్లాలో వేలల్లో కార్డులు పెండింగ్‌


అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా గతేడాది నుంచి రాష్ట్ర రవాణ శాఖను వేధిస్తున్న కార్డుల సమస్య ఎట్టకేలకు తీరింది. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు ఇచ్చే సీ-బుక్‌లు, ఎల్‌ఎల్‌ఆర్‌ తర్వాత ఇచ్చే శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు ఇక జారీ కానున్నాయి. రవాణ శాఖ కమిషనర్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్లాస్టిక్‌ కార్డులు సరఫరా చేసే కంపెనీలతో మాట్లాడి అవసరం మేరకు తెప్పించినట్లు ఆ శాఖ అధికారులు చెప్పారు. విజయవాడలోని రాష్ట్ర రవాణ శాఖ కార్యాలయానికి సోమవారం రెండున్నర లక్షల కార్డులు వచ్చాయని తెలిపారు. మంగళవారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కర్ఫ్యూ నిబంధనల సడలింపుతో సాయంత్రం వరకు ఆర్టీఏ కార్యాలయాలు పనిచేస్తున్నందున వీలైనంత తొందరగా పెండింగ్‌ సీ-బుక్‌లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు పోస్టు ద్వారా పంపుతామని అధికారులు తెలిపారు. కాగా నిరుడు కొవిడ్‌ సంక్షోభం వల్ల ప్లాస్టిక్‌ కార్డుల సరఫరా ఆగిపోయింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాలిచ్చే పేపర్లతోనే వాహనదారులు బండి నెట్టుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రోజూ 100 నుంచి 250 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. వాటికి తోడు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, రెన్యువల్స్‌ ఇతరత్రా అన్నీ కార్డుల రూపంలోనే ఆర్టీఏ జారీ చేస్తోంది. కార్డుతో పాటు పోస్టల్‌ చార్జీలకు వాహనదారుల నుంచి ఫీజు వ సూలు చేస్తోంది. నెలలు గడిచినా కార్డులను పోస్టు ద్వా రా ఇంటికి పంపకపోవడంతో ఆర్టీఏ కార్యాలయాల సిబ్బ ందితో వాహనదారులు వాదనకు దిగేవారు. నెలల తరబడి సర్దిచెప్పడం సిబ్బందికి కూడా ఇబ్బందిగా ఉం డేది. నిరుడు జూలై నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 15 వేల నుంచి 25 వేల వరకు కార్డుల జారీ పెండింగ్‌లో ఉంది. ప్లాస్టిక్‌ కార్డులు రావడంతో ఈ సమస్య తీరనుంది.

Updated Date - 2021-06-22T09:13:30+05:30 IST