Abn logo
Jul 10 2020 @ 01:58AM

అది ‘బాల్‌ ట్యాంపరింగ్‌’ సిరీస్‌

న్యూఢిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 1989లో జరిగిన టెస్టు సిరీ్‌సలో ఇరుజట్ల బౌలర్లు బాల్‌ ట్యాంపరింగ్‌ చేశారని మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరె పేర్కొన్నాడు. పాక్‌లో జరిగిన ఈ సిరీస్‌లో బౌలర్లు పదే పదే బంతిని గీకుతూ రివర్స్‌ స్వింగ్‌ రాబట్టేవారని గుర్తుచేశాడు. అయితే ఏ జట్టూ దీనిపై ఫిర్యాదు చేయలేదన్నాడు. ‘ఆ రోజుల్లో బంతిని గీకేందుకు అనుమతి ఉండేది. అందుకే ఇరు జట్ల బౌలర్లు కూడా రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టేందుకు బంతిని గరుకుగా చేసేవారు. దీంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సాధించడం సవాల్‌గా మారింది. మా జట్టులో మనోజ్‌ ప్రభాకర్‌ కూడా బంతిని గీకడం నేర్చుకుని రివర్స్‌ స్వింగ్‌ సాధించాడు’ అని మోరె తెలిపాడు. 

Advertisement
Advertisement
Advertisement