రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2021-04-11T08:39:17+05:30 IST

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజోతి): తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కూడా వర్షాలు కురిసినట్లు పేర్కొంది. మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

Updated Date - 2021-04-11T08:39:17+05:30 IST