Abn logo
Oct 27 2021 @ 22:35PM

పిల్లల్లో మనోధైర్యాన్ని నింపాలి

అవగాహన కల్పిస్తున్న లావణ్య

  • చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధి లావణ్య


కేశంపేట: పిల్లల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధి లావణ్య అన్నారు. మండల పరిధి కాకునూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098పై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, చట్టాలపై వివరించారు. గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై బాలికలకు అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ టీచర్లు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గండ్ర లక్ష్మమ్మ, లియాజ్‌ అలీ, రవీందర్‌రెడ్డి, జగదీష్‌, అంగన్‌వాడీ టీచర్లు మంజుల, మాధవి తదితరులు పాల్గొన్నారు.