Advertisement
Advertisement
Abn logo
Advertisement

అది కోహ్లీ వ్యక్తిగతం.. మనం గౌరవించాల్సిందే: రాజీవ్ శుక్లా

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రకటించడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఇండియన్ క్రికెట్ బోర్డు అతడి నిర్ణయాన్ని గౌరవిస్తుందని అన్నారు.


కెప్టెన్‌గా టీ20 జట్టుకు అతడు ఎంతో చేశాడని కొనియాడాడు. ఆ విషయాన్ని మర్చిపోలేమన్నారు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న కోహ్లీ నిర్ణయం వ్యక్తిగతమైనదని, దానిని మనం గౌరవించాలని రాజీవ్ శుక్లా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


 కోహ్లీ ఈ సాయంత్రం ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటన క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. అక్టోబరు-నవంబరు మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించాడు.  అయితే, టెస్టు, వన్డే జట్లకు మాత్రం కెప్టెన్‌గా వ్యవహరిస్తానని చెప్పడం గమనార్హం.


టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మ తదితర సహచర ఆటగాళ్లలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. 2017లో టీ20 జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement