Advertisement
Advertisement
Abn logo
Advertisement

శేషాద్రి గారి మరణం టీటీడీ వ్యవస్థలో తీరని లోటు : ఐవైఆర్ కృష్ణారావు

అమరావతి: డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. డాలర్ శేషాద్రి నిర్విరామంగా, నిరంతరాయంగా అలుపూ సొలుపూ లేకుండా స్వామివారి సేవకు అంకితమయ్యారని కొనియాడారు. ‘‘శేషాద్రి గారి మరణం టీటీడీ వ్యవస్థలో ఒక తీరని లోటును మిగిల్చింది. అన్ని కార్యక్రమాలు వ్యవహారాలు టీటీడీలో సరైన సమయంలో సక్రమంగా జరగడంలో ఆయన పాత్ర ఉన్నది. ఛాందస మైన వ్యక్తి కాదు. నిర్విరామంగా నిరంతరంగా అలుపు సొలుపు లేకుండా స్వామివారి  సేవకు అంకితమైన వ్యక్తి. టీటీడీ అర్చక వ్యవస్థలో నిరాదరణకు గురి అయిన గుమాస్తా అర్చకులకు ఈయన ఒక పెద్ద అండ. పీవీఆర్కే ప్రసాద్ గారి సమయంలో ఆయనచే ఎన్నుకోబడి గర్భాలయంలో తన విధులను ప్రారంభించిన శేషాద్రి గారు క్రమక్రమంగా తన సామర్థ్యంతో వచ్చిన ప్రతి అధికారికీ కీలకమైన సహాయకునిగా తన విధిని నిర్వహించాడు. శ్రీ శేషాద్రి గారికి సద్గతి ఆ శ్రీనివాసుడే ప్రసాదించుగాక’’ అని ఐవైఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement