Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరు: రఘురామ

ఢిల్లీ: మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి మహామహులున్నారని, వారిని తొలగిస్తే జగన్‌కు సమస్యలు తప్పవని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే పంచ్ ప్రభాకర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల మహాపాదయాత్రపై సజ్జల వ్యాఖ్యలు రాజద్రోహమేనని చెప్పారు. సజ్జల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం భయపడుతోందని రఘురామ తెలిపారు. 


‘‘ఎయిడెడ్ పాఠశాలలపై సీఎం జగన్ మనసు మారడం.. మంచి పరిణామం. ఎయిడెడ్ పాఠశాలలపై కొందరు రాజకీయం చేస్తున్నారని, జగన్ చెప్పడం బాధేస్తోంది. గతంలో ఇచ్చిన జీవోను కూడా ఉపసంహరించుకోవాలి. స్థలాపేక్షతోనే ఎయిడెడ్ పాఠశాలలపై జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు. స్థలాపేక్ష లేకపోతే వెంటనే జీవో 42,50,51లను ఉపసంహరించుకోవాలి. ఎయిడెడ్ కాలేజీల స్వాధీనంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి’’ అని రఘురామకృష్ణరాజు కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement