జనగామ జిల్లా: పెంబర్తిలో లంకె బిందె బయటపడింది. టంగుటూరు రోడ్డులో వెంచర్ కోసం ప్రొక్లెనర్‌తో తవ్వుతుండగా బంగారు నాణేలతో ఉన్న లంకె బిందె బయటపడింది. అందులో బంగారు ఆభరణాలు ఐదు కేజీల వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. కాకతీయుల కాలంనాటి ఆభరణాలుగా చెబుతున్న గ్రామస్తులు.. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే చారిత్ర ఆధారాలు తెలుస్తాయంటున్నారు.