Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐడియలిస్ట్ పొలిటీషియన్‌గా ఉంటా: పవన్‌

విశాఖ: ప్రజలను దోపిడీ చేసే రాజకీయ నేత కంటే తాను ఐడియలిస్ట్ పొలిటీషియన్‌గా ఉంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్యర్యంలో నగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమస్యను చూసి తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. ముందడుగు వేయటమే తెలుసు కాని, వెనకడుగు తెలియదన్నారు. విభజన సమయంలో రాష్ట్ర ప్రజలకు క్యాబేజీ పూలు పెట్టారన్నారు. ఇంకా మీ కాకమ్మ కథలు చెప్పద్దన్నారు. విభజన సమయం నాటి రాజకీయాలను  వైసీపీ చేస్తున్నదని పవన్‌కల్యాణ్‌  ఆరోపించారు.


తమ మాట మోడీ వినటం లేదని వైసీపీ ఎంపీలు తప్పించుకుంటున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్నవాళ్లు వైసీపీ నేతలని ఆయన దుయ్యబట్టారు. కాంట్రాక్టులు, పదవులు మాత్రమే ఎంపీలకు ముఖ్యమని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement