మహిళలు రాణించని రంగం లేదు

ABN , First Publish Date - 2021-03-08T09:29:10+05:30 IST

పురుషులతోపాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించి ప్రొత్సహిస్తే వారు రాణించని రంగమంటూ ఉండదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

మహిళలు రాణించని రంగం లేదు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌


అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పురుషులతోపాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించి ప్రొత్సహిస్తే వారు రాణించని రంగమంటూ ఉండదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని స్త్రీమూర్తులందరికీ జనసేన పార్టీ, తన తరుఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులు భూమితో పాటు సమస్త ప్రకృతినీ స్త్రీమూర్తిగా గౌరవిస్తారని చెప్పారు. మాతృదేవోభవ అని దైవంగా పూజిస్తారని, అటువంటి స్త్రీలను ప్రత్యేకంగా గౌరవించాలని కోరారు. తల్లిగా, గృహిణిగా ఆమె అందించే సేవలు అమూల్యమైనవని, వాటిని వెలకట్టలేమని అన్నారు.

Updated Date - 2021-03-08T09:29:10+05:30 IST