ఏలూరు: ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి తన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలను ఎస్పీకి వీడియో కాల్‌లో చూపించడం అమానుషమన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. పోలీసులు తన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. పార్టీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.