భారత్‌ గోల్స్‌ వర్షం

ABN , First Publish Date - 2021-11-26T10:13:47+05:30 IST

హాకీ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ ఆరంభ పోరులో ఓటమిపాలైన భారత్‌ రెండో మ్యాచ్‌లో దుమ్ము రేపింది. పూల్‌-బిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో 13-1 స్కోరుతో కెనడాను చిత్తుచేసింది.

భారత్‌ గోల్స్‌ వర్షం

  • జసంజయ్‌, అరైజీత్‌ హ్యాట్రిక్‌ 
  • కెనడాపై 13-1తో విజయం
  • హాకీ జూ.వరల్డ్‌కప్‌ 


భువనేశ్వర్‌: హాకీ జూనియర్‌ వరల్డ్‌ కప్‌  ఆరంభ పోరులో ఓటమిపాలైన భారత్‌ రెండో మ్యాచ్‌లో దుమ్ము రేపింది.  పూల్‌-బిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో 13-1 స్కోరుతో కెనడాను చిత్తుచేసింది.  వైస్‌కెప్టెన్‌ సంజయ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హ్యాట్రిక్‌ గోల్స్‌తో (17, 32, 59 ని.) మెరిశాడు. అలాగే 16 ఏళ్ల ఫార్వర్డ్‌ అరైజీత్‌ సింగ్‌ (40, 50, 51ని.) కూడా హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఉత్తమ్‌ సింగ్‌ (6, 47), శారదానంద్‌ తివారీ (35, 53) రెండేసి గోల్స్‌ చేశారు. కెప్టెన్‌ వివేక్‌సాగర్‌ (8), మణిందర్‌ (27), అభిషేక్‌ లక్రా (55) ఒక్కో గోల్‌ సాధించారు. క్రిస్టోఫర్‌(30 ని.) కెనడాకు ఏకైక గోల్‌ అందించాడు. శనివారం(రాత్రి 7.30) జరిగే తర్వాతి మ్యాచ్‌లో పోలెండ్‌ను భారత్‌ ఢీకొంటుంది. ఇతర పోటీల్లో ఫ్రాన్స్‌ 7-1తో పోలెండ్‌పై, అర్జెంటీనా 14-0తో ఈజిప్ట్‌పై, నెదర్లాండ్స్‌ 12-5 కొరియాపై, స్పెయిన్‌ 17-0తో అమెరికాపై గెలిచాయి.

Updated Date - 2021-11-26T10:13:47+05:30 IST