Abn logo
Oct 22 2020 @ 03:24AM

ఐపీఎల్‌లో.. ‘బ్లాక్‌లైవ్స్‌’ ఊసేది?

Kaakateeya

దుబాయ్‌: ఐపీఎల్‌లో ఏ జట్టూ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఊసే ఎత్తకపోవడంపట్ల్ల వెస్టిండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఐపీఎల్‌లో బ్లాక్‌లైవ్స్‌ గురించి కనీసం చర్చకూడా జరగడంలేదు. ఇంకా చెప్పాలంటే అసలు అలాంటి ఉద్యమం ఒకటి ఉందని ఇక్కడ తెలిసినట్టు కొన్ని సందర్భాల్లో అనిపించడంలేదు. ఇది విచారకరం’ అని పేర్కొన్నాడు. ఈ ప్రకటనను వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అమెరికాలో జరిగిన ఓ సంఘటనలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రో అమెరికన్‌.. శ్వేతజాతి పోలీస్‌ దాడిలో మరణించడంతో ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసింది. క్రీడా పోటీల సందర్భంగా జట్లు మోకాళ్లపై నిల్చొని ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. 

Advertisement
Advertisement