Jaunpur: ఘోర రోడ్డు ప్రమాదం... కవల సోదరులతో పాటు ఐదుగురు మృతి!
ABN , First Publish Date - 2021-07-13T17:31:04+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో గల...
జౌన్‌పూర్: Road Accident ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో గల జలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం పెళ్లివారితో వెళుతున్న ఒక కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కవల సోదరులతోపాటు ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక బాలుని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాధితుడు ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన కారును కట్ చేసి, అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. స్థానిక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలంలో ఉండి, సహాయక చర్యలు చేపడుతున్నారు.