మీ ‘నిస్సహాయత’ దేశానికి తెలుసు!

ABN , First Publish Date - 2021-05-09T08:32:43+05:30 IST

సీఎం జగన్‌కు జార్ఖండ్‌ అధికార పార్టీ జార్ఖండ్‌ ముక్తి మోర్చా ‘కౌంటర్‌’ ఇచ్చింది. ‘ప్రధాని తన మన్‌కీ బాత్‌తోపాటు... మేం చెప్పింది కూడా వింటే బాగుండేది’ అని ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను జగన్‌ తప్పుపట్టిన సంగతి

మీ ‘నిస్సహాయత’ దేశానికి తెలుసు!

జగన్‌కు జేఎంఎం కౌంటర్‌


ఢిల్లీ, మే 8: సీఎం జగన్‌కు జార్ఖండ్‌ అధికార పార్టీ జార్ఖండ్‌ ముక్తి మోర్చా ‘కౌంటర్‌’ ఇచ్చింది. ‘ప్రధాని తన మన్‌కీ బాత్‌తోపాటు... మేం చెప్పింది కూడా వింటే బాగుండేది’ అని ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను జగన్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ‘‘ఇలాంటి రాజకీయాలతో దేశం బలహీనపడుతుంది. కొవిడ్‌పై యుద్ధం చేస్తున్న మోదీని బలోపేతం చేద్దాం’’ అని జగన్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై... జేఎంఎం శనివారం ట్విట్టర్‌లోనే కౌంటర్‌ ఇచ్చింది. ‘‘వైఎస్‌ జగన్‌ జీ! మీ నిస్సహాయత గురించి దేశమంతటికీ తెలుసు. మేం మీపట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నాం. మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి’’ అని వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-05-09T08:32:43+05:30 IST