Advertisement
Advertisement
Abn logo
Advertisement

‌జాబ్ లెస్ క్యాలెండర్‌ ప్రకటిస్తే ప్రశ్నించకూడదా?: రామకృష్ణ

విజయవాడ: సోమవారం సీఎం జగన్ నివాసం ముట్టడికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత రామకృష్ణ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 లక్షల జాబులు అన్న జగన్...‌జాబ్ లెస్ క్యాలెండర్‌ ప్రకటిస్తే ప్రశ్నించకూడదా? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ శాఖల్లో 30 శాతం ఖాళీలు ఉన్నాయని ఆర్ధిక శాఖ ప్రకటించిందని గుర్తుచేశారు. ముట్టడికి పిలుపునిస్తే.. రెండు రోజుల ముందు నుంచే హౌస్ అరెస్టులు‌ చేస్తున్నారని తప్పుబట్టారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ కాలం ఉద్యమాలను ఆపలేరని రామకృష్ణ హెచ్చరించారు.

Advertisement
Advertisement