ECILలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు
ABN , First Publish Date - 2021-08-28T16:32:51+05:30 IST
హైదరాబాద్‌లోని ఎలక్రాటనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)- దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు
హైదరాబాద్‌లోని ఎలక్రాటనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)- దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన సాంకేతిక నిపుణుల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 21
ఉద్యోగాలు: టెక్నికల్ ఆఫీసర్లు 6, సైంటిఫిక్ అసిస్టెంట్లు 8, జూనియర్ ఆర్టిజన్లు 7
అర్హత: టెక్నికల్ ఆఫీసర్లకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, సైంటిఫిక్ అసిస్టెంట్లకు సంబంధిత డిప్లొమా, జూనియర్ ఆర్టిజన్లకు సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. అన్ని పోస్టులకూ ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: ఇంటర్వ్యూ నాటికి టెక్నికల్ ఆఫీసర్లకు 30 ఏళ్లు, మిగిలినవారికి 25 ఏళ్లు మించకూడదు.
ఒప్పంద వ్యవధి: రెండేళ్లు
వేతనం: టెక్నికల్ ఆఫీసర్లకు రూ.23,000; సైంటిఫిక్ అసిస్టెంట్లకు రూ.20,384; జూనియర్ ఆర్టిజన్లకు రూ.18,564
ఇంటర్వ్యూలు: ఆగస్టు 28, 31; సెప్టెంబరు 3, 4, 6
వేదికలు: ఉద్యోగాన్ని అనుసరించి ముంబయి, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీలోని ఈసీఐఎల్ జోనల్ కార్యాలయాలు.
వెబ్‌సైట్: ecil.co.in
ఇది కూడా చదవండి
ఏపీ, తెలంగాణాలోని అంగన్‌వాడీల్లో పోస్టులు
ఈ పోస్టులకు అప్లై చేశారా.. ప్రారంభవేతనమే రూ.41 వేలు
ఏపీలో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. రూ.లక్ష వరకు జీతం.. ఖాళీలు ఎన్నంటే..