Abn logo
Mar 2 2021 @ 01:05AM

జోయాలుక్కాస్‌ ఇన్‌క్రెడిబుల్‌ 50 ఆఫర్‌

హైదరాబాద్‌: జోయాలుక్కాస్‌.. ‘ది ఇన్‌క్రెడిబుల్‌ 50’ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు అన్ని బంగారు ఆభరణాల (జువెలరీ) మజూరీ చార్జీల్లో (వీ.ఏ) 50 శాతం తగ్గింపు ఇవ్వనుంది. జోయాలుక్కా్‌సలో మజూరీ చార్జీలపై ఇన్‌క్రెడిబుల్‌ 50 ద్వారా డిస్కౌంట్‌ అందిస్తున్నామని, ఇది కస్టమర్లకు ఎంతగానో లాభం చేకూరుస్తుందని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ అన్నారు. అత్యంత నైపుణ్యంతో తయారు చేసిన ఆభరణాలు ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయని, దీంతో వారు ఆదా చేయగలుగుతారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఈ నెల 14న ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోయాలుక్కాస్‌ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌తో పాటు జోయాలుక్కాస్‌ షోరూమ్‌ నుంచి కొనుగోలు చేసిన జువెలరీపై జీవితాంతం ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా, గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను ఇస్తున్నట్లు జోయాలుక్కాస్‌ తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement