Abn logo
Oct 23 2021 @ 02:37AM

జోయాలుక్కాస్‌ రూ.100 కోట్ల మెగా దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు


హైదరాబాద్‌: దీపావళి పండగను పురస్కరించుకుని జోయాలుక్కాస్‌.. వినియోగదారుల కోసం రూ.100 కోట్ల విలువైన మెగా దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌ల్లో పరిమిత ఎడిషన్‌ ప్రత్యేక దీపావళి 2021 కలెక్షన్‌ అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్‌ వెల్లడించింది. మెగా దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లో భాగంగా రూ.50,000 విలువ గల ప్రతి గోల్డ్‌ జువెలరీ కొనుగోలుపై వినియోగదారులకు రూ.1,000 గిఫ్ట్‌ వోచర్‌, రూ.25 వేల విలువ కలిగిన డైమండ్‌, అన్‌కట్‌, ప్రీషియస్‌ జువెలరీ కొనుగోలుపై రూ.1,000 గిఫ్ట్‌ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే రూ.10,000 విలువ గల వెండి కొనుగోలుపై రూ.500 బహుమతి వోచర్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్‌బీఐ కార్డ్‌ హోల్డర్స్‌కి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ (ప్రతి కార్డుపై రూ.2,500 వరకు) పొందవచ్చని తెలిపింది. కొనుగోలు చేసిన ప్రతి జువెలరీకి ఏడాది పాటు ఉచిత బీమా సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. మెగా దీపావళి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌ల్లో అక్టోబరు 22 నుంచి నవంబరు 5 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.