హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ

ABN , First Publish Date - 2021-01-08T07:38:07+05:30 IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ

ప్రమాణ స్వీకారం చేయించిన 

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ 

గవర్నర్‌, సీఎం అభినందనలు


హైదరాబాద్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ హైకోర్టు సీజేగా నియమిస్తూ డిసెంబరు 30న రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ వేంకటేశ్వరరెడ్డి చదివి వినిపించగా.. నియామక ఉత్తర్వులను గవర్నర్‌ ఆమెకు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌.. చీఫ్‌ జస్టి్‌సకు పుష్ఫగుచ్చం అందించి అభినందించారు.  ఆ తర్వాత ఆమె నేరుగా హైకోర్టుకు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.


తెలంగాణ ఏర్పడ్డాక మొదటి చీఫ్‌ జస్టి్‌సగా టిబిఎన్‌.రాధాకృష్ణన్‌, రెండో సీజేగా ఆర్‌ఎస్‌ చౌహాన్‌ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ హిమా కోహ్లీ మూడో సీజే కాగా.. తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు కే.కేశవరావు, రేవంత్‌రెడ్డి, సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, పువ్వాడ అజయ్‌, తలసాని, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి, నల్సార్‌ వర్సిటీ వీసీ ఫైజాన్‌ ముస్తఫా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-08T07:38:07+05:30 IST