Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళితుల పేరుతో వైసీపీ నేతల దోపిడి: మాజీ ఎమ్మెల్యే

గుంటూరు: వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. బొల్లాపల్లి మండలం దళితుల పేరుతో వైసీపీ నేతలు దోపిడి చేశారని ఫిర్యాదు చేశారు. అనర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని ఆరోపించారు. దళితులకు దక్కాల్సిన పట్టాలు వైసీపీ దళారులుకు దక్కాయన్నారు. అర్హులైన వారి వద్ద ఒక్కోక్కరి వద్ద రూ.10 వేలు వసూలు చేశారని ఆరోపించారు. అనర్హుల నుంచి లక్షల్లో వసూలు చేశారని పేర్కొన్నారు. రెవిన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా భూములు పందేరం చేసారని వ్యాఖ్యానించారు., ఎమ్మెల్యే బొల్లా కూడా బినామీ పేరుతో భూములు రాయించుకున్నాడని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గంలో జరిగిన భూదోపిడిపై విచారణ చేయాలని డిమాండు చేశారు. దళితుల పేరుతో భూములు దోచుకున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని కోరారు. అర్హులైన దళితులందరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని సూచించారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. 

Advertisement
Advertisement