‘విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు’

ABN , First Publish Date - 2021-10-16T21:57:27+05:30 IST

ముఖ్యమంత్రి అవినీతి, దుబారా వల్లనే విద్యుత్ కోతలని టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చేతివాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయన్నారు.

‘విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు’

అమారావతి: ముఖ్యమంత్రి అవినీతి, దుబారా వల్లనే విద్యుత్ కోతలని టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చేతివాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయన్నారు. యూనిట్ రూ.20కి ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలులో మర్మమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అసమర్ధత, అవినీతితో విద్యుత్ రంగం సర్వనాశనమైందన్నారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12వేల కోట్ల బకాయిలు పడిందన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారం మోపారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చీ రాగానే ఒప్పందాలు రద్దుతో నేడు విద్యుత్ కోతలు అన్నారు. రెండున్నరేళ్లలో వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం మోపారని పేర్కొన్నారు.  ప్రజలు విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని సూచించడం సిగ్గుచేటన్నారు. ఉద్దరిస్తానని అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని సాంతం ఊడ్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-10-16T21:57:27+05:30 IST