కలిసి సాగుతారా..!{ఎంపీ నామా చొరవతో వైరా ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల భేటీ

ABN , First Publish Date - 2021-01-26T05:37:06+05:30 IST

వైరా నియోజకవర్గంలో ఉప్పు నిప్పుగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చొరవతో సోమవారం ఆయన సమక్షంలో భేటి అయ్యారు.

కలిసి సాగుతారా..!{ఎంపీ నామా చొరవతో వైరా ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల భేటీ
రాములునాయక్‌, మదన్‌లాల్‌తో సమావేశమైన నామా

 అల్పాహార సయోధ్య సాధ్యమేనా? 

వైరా, జనవరి 25: వైరా నియోజకవర్గంలో ఉప్పు నిప్పుగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చొరవతో సోమవారం ఆయన సమక్షంలో భేటి అయ్యారు. ఇటీవల ఖమ్మంజిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీమంత్రి ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో చేసిన హెచ్చరికలు, సూచనల నేపథ్యంలో ఎంపీ నామా ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు రాములునాయక్‌, మదన్‌లాల్‌తో సోమవారం అల్ఫాహార భేటి ఏర్పాటుచేశారు. ఖమ్మంలోని నామా ఇంట్లో ఈ అల్పాహార సయోధ్య సమావేశం జరిగింది. కేటీఆర్‌ నిర్వహించిన సమావేశంలో నామాతోపాటు రాములునాయక్‌, మదన్‌లాల్‌ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. జిల్లాలోని టీఆర్‌ఎ్‌సలో ఉన్న వర్గవిభేదాలపై కేటీఆర్‌ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. కేటీఆర్‌ హెచ్చరికలతో నామా చొరవ తీసుకొని వైరా నియోజకవర్గ టీఆర్‌ఎ్‌సలో వర్గవిభేదాలకు పుల్‌స్టాఫ్‌ పెట్టేందుకు నడుంబిగించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నియోజకవర్గంలో ఇద్దరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారని సమాచారం. పార్టీ అధిష్టానం ఆదేశాలను చిరసావహించాలని, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని, తమమధ్య ఉన్న విభేదాలను వీడి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఎంపీ ఆఇద్దరికి సూచించారని తెలిసింది. వైరాలోని ప్రస్తుత టీఆర్‌ఎ్‌సలోని పరిణామాలను బట్టి వీరి మధ్య సఖ్యత సాధ్యమేనా, కలిసి సాగుతారా అనే చర్చ నడుస్తోంది.


Updated Date - 2021-01-26T05:37:06+05:30 IST