Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీబీఐ అధికారులపై కల్లూరు ఫిర్యాదు

అనంతపురం: జిల్లా ఎస్పీ ఫకీరప్పను కల్లూరు గంగాధర్‌రెడ్డి కలిశారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. వివేకా హత్యకేసులో సాక్ష్యం చెప్పాలంటూ తనను సీబీఐ అధికారులు వేధిస్తున్నారన్నారు. నెల రోజుల క్రితం సీబీఐ అధికారులు తమ ఇంటికి వచ్చారని కల్లూరు తెలిపారు. తాము చెప్పినట్లు వింటే రూ.10కోట్లు ఇస్తామని, వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.


సీబీఐ అధికారులు తనను ఏదో ఒక కేసులో ఇరికించేలా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 20న సీబీఐ విచారణకు హాజరయ్యానన్నారు. తాము చెప్పినట్లు వింటే రూ.20 లక్షలు ఇస్తామని సీబీఐ అధికారులు ఆఫర్ ఇచ్చారన్నారు. ప్రతిరోజు ఫోన్లు చేసి తనను అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. Advertisement
Advertisement