హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని: కల్యాణ్ దిలీప్ సుంకర

ABN , First Publish Date - 2020-09-29T17:42:14+05:30 IST

హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి తరఫున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంగళవారం మాట్లాడిన ఆయన.. గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని,

హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని: కల్యాణ్ దిలీప్ సుంకర

హైదరాబాద్: హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి తరఫున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంగళవారం మాట్లాడిన ఆయన.. గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని, సోమవారం అవంతి నిరసన తెలుపుతున్న సమయంలోనూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అయ్యారని తెలిపారు. హంతకుల ఇంటి ముందు పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారని, కానీ బాధితుల ఇంటి దగ్గర పోలీసులు లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. అవంతికి పోలీస్ భద్రత కల్పించాలని కోరుతున్నామని, నిందితులకు బెయిల్ రాకుండా పోరాటం చేస్తామని తెలిపారు. హేమంత్ అస్తికలు విజయవాడలో కలిపేందుకు వెళ్లే సమయంలో కూడా అగంతకులు ఫాలో అయ్యారన్నారు. హేమంత్ కుటుంబ సభ్యులకు వచ్చిన బెదిరింపు కాల్స్, రికార్డింగ్స్  మొత్తం పోలీసులకు అందజేశామన్నారు. 


ఇదిలా ఉంటే, హేమంత్ కేసులో నిందితుల కస్టడీ కోసం కూకట్ పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజుల కస్టడీ కావాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. లక్ష్మారెడ్డి, యుగంధర్, సుపారి తీసుకున్న వారిని విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ఇవాళ విననున్నారు.

Updated Date - 2020-09-29T17:42:14+05:30 IST