కమలా హ్యారిస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్
ABN , First Publish Date - 2020-12-04T15:23:01+05:30 IST
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్ నియమితులయ్యారు.
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్ నియమితులయ్యారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు, దేశీయ విధాన సలహాదారులను కూడా కమల నియమించారు. ఈ నియమకాలకు సంబంధించి కమల గురువారం ప్రకటన విడుదల చేశారు. "చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నా కార్యాలయానికి నాయకత్వం వహించేది టీనా ఫ్లూర్నోయ్. ఆమె లోతైన అనుభవం, ప్రజా విధాన నైపుణ్యం, ప్రజా సేవలో సాధించిన విజయాలు ఈ ముఖ్యమైన పదవికి ఎన్నికకావడానికి ఆమె ప్రత్యేక అర్హతలు." అని కమల పేర్కొన్నారు. అలాగే జాతీయ భద్రతా సలహాదారుగా(ఎన్ఎస్ఏ) రాయబారి నాన్సీ మెక్‌ఎల్‌డౌనీ, దేశీయ విధాన సలహాదారుగా రోహిణి కొసోగ్లును నియమించినట్లు కమల వెల్లడించారు.