Abn logo
May 17 2021 @ 22:56PM

కుమార్తెను అభినందించిన కమలా హ్యారిస్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. తన భర్త మొదటి భార్య కుమార్తెను అభినందించింది. కమల మారు కుమార్తె అయిన ఎల్లా ఎమ్హాఫ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా కమల స్పందించారు. ఎల్లాతో కలిసి ఉన్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కమల.. ‘‘గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కుమార్తె ఎల్లాకు అభినందనలు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇలాగే ఆశయాలు ఉన్న కలలు కను. నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ప్రేమతో మోమలా’ అని పోస్టు చేశారు.

తాజా వార్తలుమరిన్ని...

Advertisement