Abn logo
Nov 26 2021 @ 07:59AM

Karimnagar జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్: మానకొండూర్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు శ్రీనివాసరావు, శ్రీరాజ్, జలందర్‎గా పోలీసులు గుర్తించారు. ఖమ్మంలో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

క్రైమ్ మరిన్ని...