Advertisement
Advertisement
Abn logo
Advertisement

బావ వేధింపులు తాళలేక ఆత్మహత్య

కరీంనగర్: జిల్లా కేంద్రంలో దారుణం విషాదఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ కాపువాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. బావ కనకయ్య లైంగికంగా వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో మృతురాలు వెల్లడించినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement