మ‌హాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు భేష్‌

ABN , First Publish Date - 2021-12-04T22:54:57+05:30 IST

తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మ‌హాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు అద్భుత‌మ‌ని, కార్పొరేట్ గురుకులాల క‌న్నా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలున్నాయ‌ని క‌ర్నాట‌క రాష్ట్ర బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌య‌ప్ర‌కాష్‌ హెగ్డే ప్ర‌శంస‌లు కురిపించారు.

మ‌హాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు భేష్‌

హైదరాబాద్: తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మ‌హాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు అద్భుత‌మ‌ని, కార్పొరేట్ గురుకులాల క‌న్నా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలున్నాయ‌ని క‌ర్నాట‌క రాష్ట్ర బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌య‌ప్ర‌కాష్‌ హెగ్డే ప్ర‌శంస‌లు కురిపించారు.క‌ర్నాట‌క బీసీ క‌మిష‌న్ స‌భ్యులు ముడు రోజుల పాటు రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీల సంక్షేమానికి అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాల‌ను, వాటి ప్ర‌గ‌తిని, సాధిస్తున్న విజ‌యాల‌ను రాష్ట్ర బీసీ క‌మిష‌న్ స‌భ్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ‌ర్గ‌ల్‌లోని జ్యోతిబా ఫూలే గురుకులాన్ని సందర్శించారు. 


బిసీ గురుకులంలో ప్ర‌భుత్వం క‌ల్పించిన వ‌స‌తులు పేదవారి అభ్యున్నతికి ఉపయేగపడేలా ఉన్నాయని ప్ర‌శంస‌లు కురింపించారు. విద్యార్థినుల ప్ర‌తిభాపాట‌వాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి మైమ‌ర‌చిపోయారు. క‌ర్నాటక రాష్ట్ర బీసీ క‌మిష‌న్ స‌భ్యుల ప‌ర్య‌ట‌న శనివారంతో ముగియ‌గా, వారికి తెలంగాణ బీసీ క‌మిష‌న్ స‌భ్యులు వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా జేపీ హెగ్డే మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి, ముఖ్యంగా విద్యాభివృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, బీసీ సంక్షేమ హాస్ట‌ళ్ల ప‌నితీరు ఎంతో బాగుంద‌న్నారు. 


విద్యార్థులను చదువుతో పాటు కళాసాంస్కృతిక రంగాల్లో ప్రోత్సహిస్తున్న తీరును మెచ్చుకున్నారు.ఇక్కడి  ప‌థ‌కాల‌పై త‌మ రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించి వాటి అమ‌లుకు కృషి చేస్తామ‌న్నారు.కర్ణాటక బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ 17 కులాల చేర్పుకు సంబంధించిన అధ్యయన నివేదికను తెలంగాణ బిసి కమిషన్ సభ్యులు అందజేయడం జరిగింది.స‌మావేశంలో తెలంగాణ బీసీ క‌మిష‌న్ స‌భ్యుడు కిషోర్‌గౌడ్ , శుభ‌ప్రద్ ప‌టేల్‌, ఉపేంద్ర, క‌ర్నాట‌క బీసీ క‌మిష‌న్ స‌భ్యులు అరుణ్‌కుమార్‌, సువ‌ర్ణ‌, బీఎస్ రాజ‌శేఖ‌ర్, క‌ల్యాణ్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T22:54:57+05:30 IST