దుబ్బాకలో కత్తి కార్తీక.. నోటా కంటే..

ABN , First Publish Date - 2020-11-10T18:14:31+05:30 IST

దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో,

దుబ్బాకలో కత్తి కార్తీక.. నోటా కంటే..

ఇంటర్నెట్ డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. సీఈసీ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 45175 ఓట్లను లెక్కించగా.. కార్తీక 176 ఓట్లు పొందారు. ఇదిలా ఉంటే నోటాకు 160 ఓట్లు వచ్చాయి.  


ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ప్రచారంలో అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని.. అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే తన ఆశని ఆమె చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-11-10T18:14:31+05:30 IST