ఫోర్బ్స్ జాబితాలో కావేరీ
ABN , First Publish Date - 2020-09-30T06:53:36+05:30 IST
ఆసియాలో వంద కోట్ల డాలర్ల లోపు వార్షికాదాయం కలిగిన అత్యుత్తమ కంపెనీల జాబితాలో కావేరీ సీడ్స్‌కు చోటు దక్కింది. ‘ఆసియాస్ బెస్ట్ అండర్ ఎ బిలియన్ 2020’ పేరుతో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది...
హైదరాబాద్: ఆసియాలో వంద కోట్ల డాలర్ల లోపు వార్షికాదాయం కలిగిన అత్యుత్తమ కంపెనీల జాబితాలో కావేరీ సీడ్స్‌కు చోటు దక్కింది. ‘ఆసియాస్ బెస్ట్ అండర్ ఎ బిలియన్ 2020’ పేరుతో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. గడిచిన 10 ఏళ్లలో కంపెనీకి ఈ జాబితాలో స్థానం లభించడం ఇది ఆరోసారి. గతంలో 2015, 2013, 2012, 2011, 2010 లిస్ట్‌ల్లోనూ చోటు సంపాదించుకుంది. దేశంలోని అగ్రశ్రేణి హైబ్రిడ్ విత్తన కంపెనీల్లో కావేరీ సీడ్స్ ఒకటి.